Kerala: ట్రాఫిక్‌ జామ్‌లో వ్యక్తికి గుండెపోటు.. బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడిన ఇద్దరు నర్సులు

కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. కారులో అతడి పరిస్థితిని గమనించిన పక్కగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని ఇద్దరు నర్సులు కిందకు దూకారు. అతడికి కారులో సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి చేరుకునే వరకూ సీపీఆర్ చేస్తూ ఉండటంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. గుండెలో బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్ నిర్వహించారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటుచేసుకుంది.