kumaram bheem asifabad- ఘనంగా బక్రీద్‌ ప్రార్థనలు

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ సందర్భంగా గురువారం ముస్లింలు జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహిచారు. ఈ మేరకు ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు నాయకులు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకు అలింగనం చేసుకొని పండుగ శుభకాంక్షలు తెలుపుకున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, నాయకులు చిన్నమల్లన్న, తారీక్‌లు బక్రీద్‌ శుభకాంక్షలు తెలిపారు.