Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sanju Samson: నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. సంజు శామ్సన్ మరోసారి రెచ్చిపోయాడు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక సంజు శామ్సన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విన్నర్‌గా నిలవడమే కాకుండా, తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు తనను 'చెట్టా' (అన్నయ్య) అని పిలవడంపై స్పందిస్తూ, తనకు ఆ పిలుపు ఇష్టమేనని కానీ 'సంజూ' అని పిలిపించుకోవడమే మరింత ఇష్టమని నవ్వుతూ చెప్పాడు. ఇక తన బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ఆ అద్భుతమైన టైమింగ్ గురించి వివరిస్తూ.. గత రెండు మూడు నెలలుగా తన 'ఇనిషియల్ మూవ్‌మెంట్స్'పై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని, ప్రాథమికాంశాలకు కట్టుబడి చేతులపై నమ్మకం ఉంచి ఆడటం వల్లే షాట్లు అంత బాగా వస్తున్నాయని తెలిపాడు. నిజానికి ఈ ట్రిగ్గర్ మూవ్‌మెంట్స్ అనేవి గత మూడు ఐదేళ్లుగా చేస్తున్నవేనని, కంఫర్ట్ జోన్‌లో ఉంటేనే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలమని, బౌలర్లను బట్టి అప్పుడప్పుడు క్రీజులో కదలికలు మార్చుకోవడం తన ట్యాక్టికల్ ప్లాన్ అని వివరించాడు.