Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!

Supreme Court: సుప్రీంకోర్టు గృహిణుల (హోమ్‌మేకర్స్) శ్రమకు, సమాజానికి వారు చేస్తున్న సేవలకు అపారమైన గౌరవాన్ని ఇస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గృహిణులను 'నేషన్ బిల్డర్స్' (జాతి నిర్మాతలు) గా అభివర్ణించింది. ఇల్లు, కుటుంబ సంరక్షణలో మహిళలు చేసే పనులకు ఎంతో ఆర్థిక విలువ ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సేవల విలువను గుర్తిస్తూ ఒక గృహిణి ఊహాజనిత నెలవారీ ఆదాయాన్ని (నోషనల్ ఇన్‌కమ్) రూ. 30,000గా నిర్ధారించింది.