Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్‌పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్‌కు తప్పని టెన్షన్!

Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రిగా సి. జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగానే పట్టు సాధించాలనే బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇది కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థి శిబిరాల్లో నిశ్శబ్దంగా రాజకీయ ఆపరేషన్ నడుస్తోందట. తమిళనాడులో జూన్ 18న జరగనున్న ఒక రాజ్యసభ స్థానం ఉపఎన్నిక ద్వారా తన పార్టీ 'టీవీకే' (TVK) ని పార్లమెంటులో అడుగుపెట్టించాలని విజయ్ భావిస్తున్నారు. మేలం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సి.వి. షణ్ముగం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. అవినీతిపై కఠిన వైఖరితో, 28 ఏళ్ల సర్వీసులో 25 సార్లు బదిలీలు చేయించుకుని నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యు.సగాయాన్ని రాజ్యసభకు పంపడం ద్వారా అవినీతిపై తమకున్న చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా గత డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వాలను కార్నర్ చేయాలని విజయ్ యోచిస్తున్నారు.