అమెరికా బాటలోనే మెక్సికో.. చైనా, భారత్‌లపై 50 శాతం సుంకాలు

భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలకు, ఎగుమతిదారులకు మెక్సికో ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే దాదాపు 1400 వస్తువులపై 50 శాతం వరకు దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనలకు మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయం వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. తమ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, చైనాతో వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించడానికి ఈ చర్య తీసుకున్నామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ చెప్పినప్పటికీ.. వాస్తవానికి ఇది అమెరికా ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.