ఆసుపత్రిలో వైద్యురాలిపై బీజేపీ యువనేత అసభ్య చేష్టలు.. అడ్డుకుంటే కాల్చి చంపుతామని బెదిరింపు

ఆసుపత్రుల్లో రాత్రివేళ విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ముఖ్యంగా మహిళా వైద్యుల భద్రతపై ఆందోళనను మరోసారి బయటపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఓ మహిళను అత్యవసర చికిత్స కోసం తీసుకెళ్లిన బీజేపీ యువనేత... అక్కడ వైద్య సిబ్బందితో దురుసగా ప్రవర్తించారు. దీనిని వారించినందుకు మహిళ డాక్టర్‌ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, ఆసుపత్రి నుంచి బయటకు వస్తే నీ అంతు చూస్తామని కూడా బెదిరింపులకు దిగాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.