ఏపీలో బీఎస్సీ నర్సింగ్‌ విద్యపై ప్రభుత్వం సంచలన నిర్ణయం... నీట్-యూజీ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు

నర్సింగ్ విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని నిర్ణయించుకుంది.గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET నిర్వహించారు. అయితే 16000 సీట్లకు గాను 4000 సీట్లు మిగిలిపోయాయి. దీంతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజా ప్రతిపాదనలు సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు.ఇకపై నర్సింగ్ ప్రవేశాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది., News News, Times Now Telugu