‘కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఏ దశలోనూ రాజీపడకుండా పాలన వ్యవస్థను పరుగులుపెట్టిస్తున్నారు అని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ‘పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేగంగా సాగుతోంది. సాస్కీ నిధులు రూ.2123 కోట్లు పంచాయతీలకు కేటాయించి రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యితో రోడ్లన్నీ అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు వేల కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేస్తున్నాము. నా సొంత నియోజకవర్గమైన తాడేపల్లిగూడెంలోనే దాదాపు రూ.240 కోట్లకు పైగా కేంద్రం నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా వేగంగా ముందుకు సాగుతూ ఉంటే జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉంది. గత ఐదేళ్లు సంక్షేమం పేరిట అందినకాడికి దోచుకున్నారు. చివరకు కాసులకు కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు’అని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు., News News, Times Now Telugu