ఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
పనితీరు బాగాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలను గద్దె దించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్చేశారు. ఈ మేరకు ‘రైట్ టు రీకాల్’ విధానాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు.