గాంధీ జయంతి రోజు ప్రజలందరూ ఆ బట్టలే ధరించండి: ప్రధాని మోదీ

గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులైన ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసి, వాటినే ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తన మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ఉద్దేశం కాదని, భారత దేశాన్ని స్వయం సమృద్ధ దేశంగా మార్చాలన్న లక్ష్యమని పేర్కొన్నారు. ఖాదీ పరిశ్రమ గత దశాబ్దంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ప్రజలు వికసిత భారత్ కల సాకారం చేయాలని ఆయన సూచించారు.