చైనా సైన్యం గుప్పిట్లోకి బలూచిస్థాన్? పాక్ సహకారంతోనే కుట్రలు.. భారత్ జోక్యం చేసుకోవాలంటున్న బలూచ్ నేత

దక్షిణాసియా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నాయి బలూచిస్థాన్ నుంచి వస్తున్న తాజా పరిణామాలు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సీపెక్ (CPEC) రక్షణ కోసం చైనా ఏకంగా తన సైనిక బలగాలను బలూచిస్థాన్ గడ్డపై దింపేందుకు సిద్ధమవుతోందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కీలక పరిణామంపై బలూచ్ ప్రతినిధి మీర్ యార్.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక సంచలన లేఖ రాశారు. కొద్ది నెలల్లోనే బలూచిస్థాన్ గడ్డపై చైనా సైనికుల బూట్ల చప్పుడు వినిపించబోతోంది అంటూ ఆయన చేసిన హెచ్చరిక భారత భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది.