తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలలో కొన్నింటిని వైకుంఠ ఏకాదశి నుంచి...మిగతా వాటిని ఫిబ్రవరి నెల నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6.15 నుంచి 6.45 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. భక్తులు స్వామివారికి తోమాల సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న విధానానికి భిన్నంగా తులాభారం సేవను సరికొత్తగా రూపొందించారు. ఈ సేవలో అవసరమైన నాణేలు, బెల్లం వంటి వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందుబాటులో ఉంచనున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తులాభారం నిర్వహించుకునే అవకాశం కలగనుంది., News News, Times Now Telugu