తాగి దొరికితే లక్ష జరిమానా.. పథకాలు కట్! ఊరు బాగు కోసం గ్రామస్తుల ఉక్కు సంకల్పం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ధనియాలపాడు గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలు, నాటుసారా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండటాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ సనప సావిత్రి, పాలకవర్గంతో కలిసి ఒక కీలక తీర్మానం చేశారు.