తిరుమలలో చేసినట్లు చేయండి.. యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మఠాలు, కుల సంఘాలకు భూముల కేటాయింపుపై కొత్త పాలసీ రూపొందించాలని.. ఆ భూముల యాజమాన్య హక్కులు దేవస్థానానికే ఉండాలని స్పష్టం చేశారు. గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, భూసేకరణ, టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. అంబులెన్స్‌లు, ఎంఆర్ఐ సేవలను ప్రారంభించిన సీఎం.. మహిళా స్వయం సహాయక సంఘాలకు విస్తృతంగా రుణాలు అందించాలని బ్యాంకులను కోరారు.