తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు.. ఎక్కడెక్కడంటే..

తెలంగాణలో విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను (KVs) మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న 35 KVsకు ఇవి అదనం. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల రూరల్ (చెల్గల్), వనపర్తి (నాగవరం) ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఇప్పటికే రూ. 400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను, రూ. 1000 కోట్లతో ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసింది.