"నెలకు లక్షన్నర జీతం ఉండి.. భార్యకు రూ.15 వేలు ఇవ్వలేరా?": సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

భార్యకు నెలకు రూ.15 వేల భరణం ఇవ్వడం ఇష్టం లేక దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. నెలకు రూ.1.46 లక్షల భారీ జీతం తీసుకుంటూ కేవలం 15 వేల రూపాయల భృతిని సవాల్ చేయడంపై జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదుల ఫీజుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ సుప్రీం కోర్టు దాకా రాగలిగినప్పుడు.. భార్యకు ఆమాత్రం ఇవ్వలేరా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఆమె ఉద్యోగం చేస్తోందన్న భర్త వాదనను తోసిపుచ్చుతూ.. సదరు టెక్కీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పూర్తిగా కొట్టేసింది.