నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన నాగరాజు(52)పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయపురం మండలంలోని ఓ దళితవాడకు చెందిన నాగరాజు.. స్థానికంగా ఉన్న ఓ చిన్నారికి మామిడి పండు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపు వేసి లైంగిక దాడికి పాల్పడగా, చిన్నారి ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె ఏడుపును పసిగట్టిన తల్లి వెళ్లి తలుపు తీసి చూడగా నాగరాజు వికృత చేష్టలు బయటపడ్డాయి. అతడికి దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేశారు. పరారీలోని నిందితుడిని అదుపులోకి తీసుకొని శనివారం రిమాండుకు తరలించారు.