ఫిలిప్పీన్స్‌లో ఘోర భూకంపం.. 41 మంది మృతి.. ఆస్పత్రుల బయటే వైద్యం అందిస్తున్న డాక్టర్లు

భారీ భూకంపం ధాటికి వణికిపోయిన ఫిలిప్పీన్స్‌లో గుండెల్ని పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రి భవనాలు దెబ్బతినడంతో తీవ్రమైన ఎండలోనే తాత్కాలిక టెంట్లు వేసి మరీ వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర విపత్తు వల్ల మృతుల సంఖ్య 41కి చేరగా.. గాయపడిన వారి సంఖ్య 450 దాటిందని వైద్యులు వివరిస్తున్నారు. అయితే ఇంకా శిథిలాల కింద కొందరు ఉన్నారని.. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోందని చెబుతున్నారు. కాకపోతే వరుసగా వస్తున్న భూప్రకంపనల వల్ల వారు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.