భార్య వేసిన కేసులో మొదటి భర్తను కాపాడిన రెండో భర్త.. 17 ఏళ్ల తర్వాత వీడిన చిక్కుముడి

సాధారణంగా గృహ హింస కేసుల్లో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ముంబైలోని ఒక కోర్టులో జరిగిన ఉదంతం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. తన మొదటి భర్త పెడుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించి, భరణం ఇప్పించాలంటూ ఒక మహిళ దాదాపు 17 ఏళ్ల క్రితం న్యాయపోరాటం మొదలు పెట్టింది. అయితే ఈ కేసు క్లైమాక్స్‌లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మొదటి భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సిన చోట.. ఆమె ప్రస్తుత (రెండో) భర్త బోనులోకి ఎక్కి, ఏకంగా మొదటి భర్తకే మద్దతుగా సాక్ష్యం చెప్పాడు. దీంతో అతడిపై ఉన్న కేసును కొట్టివేశారు.