తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల: డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...జనవరి 3 నుంచి పరీక్షలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్‌టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇకపోతే జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్‌-1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా టెట్‌ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది., News News, Times Now Telugu