మరో చెరువుకు పునరుజ్జీవం.. 104 లారీల చెత్తను తొల‌గించిన హైడ్రా..

హైడ్రా (HYDRAA) చేపట్టిన ఆపరేషన్ అంబీర్ చెరువు ద్వారా ప్రగతినగర్ చెరువుకు పునరుజ్జీవం లభిస్తోంది. వ్యర్థాలతో నిండిన ఈ చెరువును ప్రక్షాళన చేసేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో సిబ్బంది సెలవుల్లోనూ శ్రమించి 104 లారీల చెత్తను తొలగించారు. చికెన్, మాంసం వ్యర్థాలను పారబోస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు.. చెరువు మధ్యలో ఉన్న రహదారికి ఇరువైపులా శుభ్రం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపుతూ.. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మురుగునీరు చేరకుండా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థానికులు మద్దతు తెలుపుతున్నారు.