యూరియా పంపిణీలో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేర్యాలలో వేలాది యూరియా బస్తాలు మాయమైన ఘటన మరువక ముందే, బైరాన్పల్లి గ్రామంలో మరో అక్రమం బయటపడింది. కూటిగల్ గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా తీసుకోకపోయినా తీసుకున్నట్లు మొబైల్కు సందేశం రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థ ద్వారానే ఈ అక్రమం బయటపడటం గమనార్హం. యూరియా మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..