kumaram bheem asifabad- ఎడతెరపి లేని వర్షం

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. బెజ్జూరు మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవుతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్‌, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, నాగేపల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.