రెండు తెలుగు రాష్ట్రాల్లో SIR కలకలం. అనుమానాలేంటి.. నిబంధనలు ఏంటి

దేశమంతటా బెంగాల్ ఫోబియా..! బెంగాల్లో ప్రభుత్వం మారి, ఓడిపోయిన దీదీ పార్టీకి చినిగి చాటౌతున్నందుక్కాదు. బెంగాల్లో గెలుపోటముల్ని నిర్ణయించిందని ప్రచారం జరుగుతున్న ఆ సర్ ప్రకియ చుట్టూనే దేశ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీలన్నీ ఎటెన్షన్ మోడ్లో కొచ్చేశాయి. ఎందుకంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR తర్వాత బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి 91 లక్షలకు పైగా ఓట్లు డిలీటయ్యాయి. మొత్తం ఓట్లలో ఇదా దాదాపు 12 శాతం. ఒక్క ఓటుతోనే నేతల జాతకాలు తలకిందులౌతాయి. మరి 12 శాతం ఓట్లు గల్లంతైతే, అలా గల్లంతైన ఓట్లలో మనోళ్ల ఓట్లు ఉంటే.. ఊహించుకుంటేనే వణికిపోతోంది అన్ని పార్టీలకు. ఇప్పటికే ఆంధ్రాలో మొదలైపోయింది ఓట్ల వడపోత. తెలంగాణాలో ఈనెల 25 నుంచి సర్ ప్రక్రియ అమలవబోతోంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్లు.