రైతు భరోసా నిధుల విడుదల.. 44.28 లక్షల రైతుల అకౌంట్లలో రూ.2,482 కోట్లు జమ

రైతు భరోసా పథకం తొలి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి జమ చేశారు. అర్హులైన రైతులందరికీ దశలవారీగా పెట్టుబడి సాయం అందిస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.