తెలంగాణలో పదేళ్ల తర్వాత కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఇకపై మల్టీపర్పస్ సంచుల్లో సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్‌ను తగ్గించేందుకు, ఎక్కువ రోజులు మన్నేలా వీటిని రూపొందించారు. వాస్తవానికి ఈ 6 కిలోల బియ్యం సంచుల పంపిణీ అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కావాలి. అయితే, ఈ సంచులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, ఆరు గ్యారెంటీ లోగోలు ఉండటం వల్ల, ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.