విద్యార్థులకు మరో పథకం.. ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు గానూ ఏపీ వక్ఫ్ బోర్డు కొత్త పథకం తీసుకురానుంది. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తలీం ఇ హునార్ పేరుతో ఏపీ వక్ఫ్ బోర్డు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పేరుతోనే ముస్లిం విద్యార్థుల కోసం కొత్త పథకం తేవాలని నిర్ణయించారు. ఈ పథకం కింద ఏటా 500 మంది ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని నిర్ణయించారు.