వీబీ-జి రామ్ జీ చట్టం 2025తో వలసలు పెరిగే ప్రమాదం...MGNREGAను యధాతథంగా అమలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని #MGNREGA యధాతథంగా అమలు చేయాలని శాసనసభ ద్వారా డిమాండ్ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. “వికసిత్ బారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల మహిళలు ఉపాధికి హామీ లేకుండా చేస్తుంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే విధంగా కొత్త నిబంధనలు పేదల పట్ల శాపంగా మారనున్నాయి. పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారెంటీ పథకమిది. గడిచిన 20 ఏళ్లలో ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారిలో రాష్ట్రంలో 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ది పొందారు’అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు., News News, Times Now Telugu