పెళ్లికి ముందు శృంగారం చేస్తే.. యువతీయువకులు నేరుగా జైలుకే: సర్కారు సంచలన నిర్ణయం

ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా ఇప్పుడు ఒక వివాదాస్పద చట్టంతో వార్తల్లో నిలిచింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉన్న కొత్త శిక్షాస్మృతి అక్కడ అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. వివాహం చేసుకోకుండా జంటలు సహజీవనం చేయడం లేదా పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనిని ఉల్లంఘిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేవలం స్థానికులకే కాకుండా అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.