వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ.. దేశంలోనే తొలిసారి.. రూ.3 కోట్లు పలికిన హాకర్ 800ఏ

దేశంలో తొలిసారిగా హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ ప్రైవేట్ జెట్‌ను ఎంఎస్‌టీసీ ద్వారా ఈ-వేలంలో రూ.3 కోట్లకు విక్రయించింది. ఫాల్కన్ గ్రూప్ ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ రూ.792 కోట్ల పోంజీ మోసానికి సంబంధించిన కేసులో ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రత్యేక కోర్టు అనుమతితో బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరింత దర్యాప్తు కొనసాగుతోంది.