సుప్రీంకోర్టులో విజయ్‌ సర్కారకు భారీ ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే

తమిళనాడులో గోవధను నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి.. మధ్యంతర ఉత్తర్వు వెలువరించింది. పాల ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా గోవధను నిషేధిస్తూ 1976లో జారీచేసిన ఉత్తర్వులు ఆధారంగా మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఈ నిబంధనలు జంతు వధను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించినవి తప్పా.. పూర్తి నిషేధానికి కాదని సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదించింది.