హర్మూజ్‌ జలసంధిలో కొత్తగా ఇరాన్ 'సర్వీస్ ఫీజు'.. మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో సర్వీస్ ఫీజును విధించేందుకు ఇరాన్ రెడీ అవుతోంది. హర్మూజ్‌లో భద్రత, నౌకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సర్వీస్ ఫీజును వసూలు చేస్తామని ఇరాన్ రాయబారి తెలిపారు. ఈ అంశంపై ఒమన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే మిత్రదేశాలకు ఈ సర్వీస్ ఫీజులో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ భద్రతను ఒమన్‌తో కలిసి నిర్వహిస్తామని ఇరాన్ స్పష్టం చేయగా.. నిర్దేశిత మార్గాన్ని పాటించని 8 నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు తెలుస్తోంది.