అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. 6 ఏళ్లలో తొలిసారి, 7.5 లక్షల ఉద్యోగులపై ఎఫెక్ట్

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అధికార రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని ప్రతిపక్ష డెమొక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం పడనుంది. వీరి జీతాలు ఆగిపోనున్నాయి. సైన్యం సహా ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవారు జీతాలు తీసుకోకుండానే పనిచేయాల్సి ఉంటుంది. అయితే గత 6 ఏళ్లలో షట్‌డౌన్ కావడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.