ఆగ్రాలోనే అమర్‌నాథ్.. ఫ్రిజ్‌లో ‘మంచు లింగం’ ప్రత్యక్షం.. క్యూకడుతోన్న జనం..

ఓ ఇంటిలోని ఫ్రిజ్‌లో ఏర్పడిన ఆకారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది దేవుడు మహిమేనని జనాలు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన యూపీలో ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ ఫ్రీజర్‌లో మంచు లింగం ఆకారంలో ఉండటమే దీనికి కారణం. దీనిని కొందరు అమర్‌నాథ్ మంచు లింగంతో పోల్చడం గమనార్హం. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఇలాంటివి తయారు చేయొచ్చని కొందరు, డీఫ్రాస్ట్ బటన్ నొక్కితే కరిగిపోతుందని ఒకరు కామెంట్ పెట్టారు.