ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఆరంభం మాత్రమే: సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.