ఎక్సైజ్ పాలసీలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. వారికి పండగే..

ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార్లపై విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్యాక్స్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక మీదట రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు వేర్వేరు ధరలు ఉండవని అధికారులు చెప్తున్నారు.