ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు...పూర్తి డిటైల్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ బదిలీలలో పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో కీలక అధికారులు ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావును నియమించగా.. అక్కడ పనిచేస్తున్న బి. బాలస్వామిని విజయనగరం మున్సిపాలిటీకి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా పనిచేస్తున్న జి. సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా...అక్కడ ఉన్న టి. వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించింది.ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఒకరికి పోస్టింగ్ ఇవ్వగా... ఇద్దరిని సీడీఎంఏకురిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది., News News, Times Now Telugu