ఫిబ్రవరి 15న టీటీడీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్

తిరుమల తిరుతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్డీపీపీ, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పందాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు., News News, Times Now Telugu