"ఐఎస్‌ఐ గుప్పిట్లోనే మా చట్టసభ": పాకిస్థాన్ అసెంబ్లీ వేదికగా ఖవాజా ఆసిఫ్ సంచలన కామెంట్లు

పాకిస్థాన్ పార్లమెంట్ నిర్ణయాలను ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏ విధంగా శాసించిందనే నగ్న సత్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జాతీయ అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఐఎస్‌ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ స్పీకర్ నివాసంలోనే తిష్టవేసి, చట్టసభ కార్యకలాపాలను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. నిఘా సంస్థ ఒత్తిడి వల్లే యాంటీ మనీలాండరింగ్ వంటి కీలక చట్ట సవరణలు చేయాల్సి వచ్చిందని అంగీకరిస్తూనే.. ప్రస్తుతం తమ ప్రభుత్వం నడుపుతున్న పౌర, సైనిక హైబ్రిడ్ పాలన వల్ల దేశంలో మంచి ఫలితాలు వస్తున్నాయని రక్షణ మంత్రి సమర్థించుకున్నారు.