క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. అమ్మే ఫస్ట్.. నితీష్ కుమార్ రెడ్డిపై లోకేష్ ప్రశంసలు

తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం రోజున అఫ్గానిస్తాన్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. విలేకర్ల సమావేశం జరుగుతున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డికి తల్లి నుంచి ఫోన్ రాగా.. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ చేస్తానమ్మా అంటూ ఆయన తెలుగులో బదులిచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్ అయినా, విలేకర్ల సమావేశమైనా అమ్మే ఫస్ట్ అంటూ ట్వీట్ చేశారు.