చంపేస్తాం...ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ బెదిరింపు లేఖ కలకలం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌‌కు బెదిరింపు లేఖ రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నేరుగా మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయానికి చంపేస్తాం అంటూ మావోయిస్టుల లేఖ రావడం సంచలనంగా మారింది. నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించారు.ఈ బెదిరింపు లేఖపై మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు. సచివాలయంలోకి ఇది ఎలా చేరింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పోలీపులు పరిశీలిస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపారా..? లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా.?అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్, నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి., News News, Times Now Telugu