తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ కీలక అప్డేట్

తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, పవనాల గమనం మందగించడంతో జూన్ ఆఖరుకు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు తీవ్రమయ్యాయి. అయితే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో నేడు రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, మరికొన్ని జిల్లాల్లో నేడు, రేపు వడగాలుల తీవ్రత కొనసాగనుండటంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.