తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్.. తగ్గనున్న 140 కి.మీ దూరం, రైల్వే బోర్డుకు ఏపీ విజ్ఞప్తి

సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టును రైల్వే శాఖ సొంత నిధులతోనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే బోర్డుకు తాజాగా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 14 శాతానికి పైగా ఉంటుందని, ఇది రైల్వే శాఖకు అత్యంత లాభసాటి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ 118.9 కిలోమీటర్ల కొత్త లైన్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని కొత్తగూడెం, మణుగూరుల నుంచి ఏపీలోని కాకినాడ పోర్టుకు బొగ్గు రవాణా దూరం 140 కి.మీ మేర తగ్గుతుంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే దీనిని పూర్తిగా భరించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా అడగవద్దని ఏపీ కోరింది.