దేశ రాజధాని గగనతలంపై ‘సుదర్శన చక్ర’.. కేంద్రం ఆమోదం

ఢిల్లీలో భద్రతను పటిష్టం చేయడానికి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5,181 కోట్లతో స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయనుంది. సుదర్శన చక్ర ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్లు, క్షిపణుల వంటి ముప్పులను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. భారత సైనిక సామర్థ్యాలను పెంచే దిశగా ఈ చర్యలున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత తన భద్రత వ్యూహాన్ని సమీక్షించింది.