నందిని పాలపై వివాదాస్పద రీల్స్.. డాక్టర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ!

సోషల్ మీడియాలో కేవలం లైకులు, వ్యూస్ కోసం ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఇష్టారాజ్యంగా అవాస్తవాలు ప్రచారం చేసే కంటెంట్ క్రియేటర్లకు కర్ణాటక హైకోర్టు గట్టి షాకిచ్చింది. కేఎంఎఫ్‌కి చెందిన ప్రముఖ నందిని స్ట్రాబెర్రీ పాల వేరియంట్ నకిలీదంటూ వివాదాస్పద రీల్స్ చేసిన బెంగళూరు డాక్టర్ శరణ్య పద్మపై నమోదైన ఎఫ్‌ఐఆర్ స్టే పిటిషన్‌ను న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. శాస్త్రీయ పరీక్షలు లేకుండా సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి ఇన్‌స్టాగ్రామ్ వేదిక కాదు అని జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.