న్యూ ఇయర్ వేళ పుతిన్‌కు షాకిచ్చిన అమెరికా.. సాక్ష్యాలు చూపించినా ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయలేదంటూ..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందంటూ మాస్కో చేసిన ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో పెను తుపానును సృష్టించాయి. అయితే ఈ గందరగోళానికి తెరదించుతూ అమెరికా నిఘా సంస్థ (CIA) సంచలన నివేదికను బయట పెట్టింది. అసలు పుతిన్ ఇంటిపై దాడి జరగలేదని, రష్యా చెబుతున్నవన్నీ ఆధారాలు లేని ఆరోపణలేనని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఒకవైపు పుతిన్ స్వయంగా డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం, మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ దీనిని కొట్టిపారేయడంతో ఈ డ్రోన్ డ్రామా ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కొత్త దౌత్య యుద్ధానికి దారితీసింది.