న్యూయార్క్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. తొలిసారి ఖురాన్‌పై మేయర్ ప్రమాణ స్వీకారం

ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత సంతతికి చెందిన 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ 112వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. సాధారణంగా బైబిల్ మీద ప్రమాణం చేసే సంప్రదాయానికి భిన్నంగా మమ్దానీ ఏకంగా శతాబ్దాల నాటి పవిత్ర ఖురాన్‌పై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది. అంతేకాకుండా నగర చరిత్రలో ఒక సబ్‌వే స్టేషన్‌లో ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా, తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఆయన అరుదైన రికార్డులను తిరగరాశారు.