నా కుక్క నా కూతురితో సమానం, దానికి డిపెండెంట్ హోదా ఇవ్వండి: కోర్టుకెక్కిన మహిళ

పెంపుడు జంతువులపై మమకారం ఏ స్థాయికి చేరుతుందో నిరూపించే ఒక ఆసక్తికర ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ కుక్కను ఆస్తిగా కాకుండా.. చట్టబద్ధంగా తనపై ఆధారపడిన డిపెండెంట్‌గా గుర్తించాలని కోరుతూ అమండా రేనాల్డ్స్ అనే మహిళ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) పై కేసు వేశారు. ఆ కుక్క పోషణ కోసం తాను ఏటా రూ. 4.5 లక్షలు ఖర్చు చేస్తున్నానని, అది అన్ని విధాలా తనపైనే ఆధారపడి ఉన్నందున దానికి పన్ను రాయితీలు పొందే హక్కు ఉండాలని ఆమె వాదించారు. అది కేవలం జంతువు కాదు.. నా కూతురితో సమానం అంటూ ఆమె వేసిన ఈ పిటిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.