ముచ్చటగా మూడోసారి ట్రంప్ కుమారుడి నిశ్చితార్థం.. ఈసారి వివాహం ప్రియురాలు బెట్టినాతోనే..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరోసారి నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు. వైట్‌హౌస్‌లో జరిగిన ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా.. మోడల్, సామాజిక కార్యకర్త అయిన తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. 2018లో మొదటి భార్య వెనెసాకు విడాకులు ఇచ్చిన తర్వాత, 2020లో ఫాక్స్‌న్యూస్ మాజీ హోస్ట్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న ట్రంప్ జూనియర్... ఇప్పుడు బెట్టినాతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ ఎన్నారై వివాహ వేడుకలో ఈ జంట కలిసి సందడి చేయగా.. తాజాగా ఈ శుభవార్తను స్వయంగా ట్రంప్ జూనియర్ ధృవీకరించారు.